తొలిసారి 26 వేల పాయింట్లను తాకిన సెన్సెక్స్

7 Jul, 2014 10:18 IST|Sakshi
తొలిసారి 26 వేల పాయింట్లను తాకిన సెన్సెక్స్

ముంబై: కేంద్ర వార్షిక బడ్జెట్ గురువారం(10న) వెలువడనున్న నేపథ్యంలో నేడు స్టాక్ మార్కెట్లు కదం తొక్కాయి. మార్కెట్ సూచిలు జీవనకాల గరిష్టస్థాయిని అందుకున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంకాగానే బీఎస్ఈ సూచి సెన్సెక్స్  26 వేల పాయింట్లను తాకింది. సెన్సెక్స్ 26 వేల పాయింట్ల స్థాయిని అందుకోవడం ఇదే మొదటిసారి. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 7,787 పాయింట్లను తాకింది.

మోడీ ప్రభుత్వం లోక్‌సభలో మంగళవారం(8న) రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆపై బుధవారం(9న) ఆర్థిక సర్వే వెల్లడికానుంది. ఇవికాకుండా శుక్రవారం సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఏడాది తొలి క్వార్టర్(2013-14, ఏప్రిల్-జూన్) ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఇదే రోజున మే నెలకుగాను పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు