సెన్సెక్స్ సరికొత్త రికార్డు!

2 Jul, 2014 14:01 IST|Sakshi
సెన్సెక్స్ సరికొత్త రికార్డు!
బ్యాంకింగ్, మెటల్, ఆటో మొబైల్, కాపిటల్ గూడ్స్ రంగాల్లో కొనుగోళ్లు ఊపందుకోవడం, బడ్జెట్ పై సానుకూలాంశాలు ఉండవచ్చనే అంచనాలతో  భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో 25789 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయిని అధిగమించింది. 
 
బుధవారం ట్రేడింగ్ లో సెన్సెక్స్ 25,660 పాయింట్ల వద్ద ఆరంభమై, ఓ దశలో 25,816 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. మధ్యాహ్నం ఒకటిన్నర సమయానికి 292 పాయింట్ల లాభంతో 25811 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 87 పాయింట్ల వృద్దితో 7722 వద్ద కొనసాగుతోంది. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో సెసా స్టెర్ లైట్ అత్యధికంగా 3.63 శాతం, యునైటెడ్ స్పిరిట్స్, జిందాల్ స్టీల్, మారుతి సుజుకీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, గెయిల్, పీఎన్ బీ, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 
మరిన్ని వార్తలు