-

మెటల్‌, బ్యాంక్స్‌ జోరు : మార్కెట్లు హైజంప్‌

9 Jul, 2020 14:44 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి.  ఆరంభ లాభాలనుంచిమరింత ఎగిసిన కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలనుఅధిగమించి ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 104 పాయింట్లు ఎగిసి 10810 వద్ద,  సెన్సెక్స్‌ 404 పాయింట్ల లాభంతో 36730 వద్ద ట్రేడవుతోన్నాయి. మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇదే జోరుతో ఉంది. అయితే ఎఫ్‌అండ్‌ఓ వీక్లీ ఎక్స్‌పైరీ కారణంగా ఎనలిస్టులు అప్రమత్తతను సూచిస్తున్నారు. 

హిందాల్కో, టాటా స్టీల్‌, వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు మోస్ట్‌ యాక్టివ్‌ స్టాక్స్‌గా ఉన్నాయి. హీరోమోటో కార్ప్‌, మారుతి సుజుకీ, యూపీఎల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, టైటాన్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. అటు డాలరు మారకంలో 3 పైసలు ఎగిసిన రూపాయి 74.99 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు