ఫెడ్‌ ఎఫెక్ట్‌: భారీ నష్టాల్లో సూచీలు

19 Sep, 2019 13:50 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి.  మిడ్‌ సెషన్‌ తరువాత అమ్మకాల జోరుతో సెన్సెక్స్‌ 430 పాయింట్లు పతనమై 36133వద్ద, నిఫ్టీ 134 పాయింట్లు క్షీణించి 10706 వద్ద కొనసాగుతోంది.  దాదాపు అన్ని రంగాలూ భారీగా నష్టపోతున్నాయి. అంచనాలకు అనుగుణంగా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును పావు శాతంమేర తగ్గించిన నేపథ్యంలో ఉన్నట్టుండి అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రధానంగా మీడియా, మెటల్‌, బ్యాంక్స్‌, ఐటీ, ఫార్మా రంగాలు  పతనంమవుతున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 10 శాతం పతనం కాగా, జీ, టాటా స్టీల్, వేదాంతా, ఐబీ హౌసింగ్‌, ఇండస్‌ఇండ్, ఐసీఐసీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఐషర్‌ 6-2 శాతం మధ్య క్షీణించాయి. బ్లూచిప్స్‌లో కేవలం టాటా మోటార్స్‌, ఎయిర్‌టెల్, బ్రిటానియా, ఏషియన్‌ పెయింట్స్ స్వల్ప లాభాలకు పరిమితమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు