ట్రేడ్‌ వార్ భయం: నష్టాల ప్రారంభం

19 Jun, 2018 09:34 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి.  అంతర్జాతీయ సంకేతాలతో  కీలక సూచీలు బలహీనంగా ఉన్నాయి. సెన్సెక్స్‌ 68 పాయింట్లు నష్టపోయి 35,480 వద్ద,  31 పాయింట్లు పతనమై 10,769 వద్ద ,  నిఫ్టీ కీలక స్థాయిని కోల్పోయింది. చైనా అమెరికా ట్రేడ్‌వార్‌ ఆందోళనతో దాదాపు అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. ఆయిల్‌ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. హెచ్‌పీసీఎల్‌, బీపీపీఎల్‌ 2శాతానికి పైగా  నష్టపోతున్నాయి.  ఇంకా వేదాంతా, ఐషర్‌, కోల్‌ ఇండియా, గ్రాసిమ్‌, హీరోమోటో, ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ నష్టాల్లోనూ, బజాజ్‌ ఫైనాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా మోటార్స్‌, లుపిన్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ స్వల్ప లాభాల్లో  కొనసాగుతున్నాయికాగా  అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో  సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్ల ప్రతికూలంగా ముగిశాయి ఆసియాలోనే అదే ధోరణి కనిపిస్తోంది.  ఇది దేశీయ మార్కెట్లను కూడా ప్రభావితం చేస్తోంది.
 

మరిన్ని వార్తలు