సెన్సెక్స్‌ మరో రికార్డు

14 Jan, 2020 11:56 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి కోలుకుని కొత్త గరిష్టాలను తాకాయి. అటు ఆర్థికమందగమనం, ఇటు ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగినప్పటికీ సెన్సెక్స్ మంగళవారం 41,903.36 వద్ద ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని  నమోదు చేసింది. అయితే లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సూచీలు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి.  సెన్సెక్స్‌ 11పాయింట్లు క్షీణించి 41847 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభపడి12 333 వద్ద కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, టీసీఎస్‌ హీరో మోటోకార్ప్, హెచ్‌సిఎల్ టెక్, ఐటీసీ, ఎంఅండ్‌ఎం లాభపడుతుండగా, యస్‌ బ్యాం‍కు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా  నష్టపోతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబరులో ఐదున్నర సంవత్సరాల గరిష్ట స్థాయి 7.35 శాతానికి చేరుకున్న సంగతి   తెలిసిందే. 

మరిన్ని వార్తలు