సాఫ్ట్ బ్యాంక్ సీవోవో జీతం ఎంతో తెలుసా?

30 May, 2016 13:08 IST|Sakshi
సాఫ్ట్ బ్యాంక్ సీవోవో జీతం ఎంతో తెలుసా?

టోక్యో:  ప్రపంచ కార్పొరేట్ రంగంలో భారతీయుల హవా కొనసాగుతోంది.  జపాన్‌కు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ అధ్యక్షుడు, సీవోవో నికేష్ అరోరా (48)  ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 5వందలకోట్ల  భారీ  వేతనంతో  మరోసారి తన సత్తాను చాటుకున్నారు. మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి  73 మిలియన్ డాలర్ల  పే ప్యాకేజీ తో వరుసగా  రెండవసంవత్సరం  కూడా  వరల్డ్ టాప్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్ గా అవతరించారు. 

ఇప్పటికే  జపాన్ లో అత్యధిక వేతనం అందుకుంటున్న అరోరా ఈ స్పెషల్ ప్యాకేజ్ తో అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న టెక్ దిగ్జజాలు ఆపిల్ సీఈవో టిమ్ కుక్ , వాల్ట్ డిస్నీ యొక్క బాబ్ ఇగెర్  సరసన చేరారు.  ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి సాఫ్ట్‌వేర్ సంస్థలు అధిపతులుగా  భారతీయులు  ఉన్నత స్థానాల్లో అత్యధిక వేతనాలు పొందుతూ రికార్డు సృష్టించారు.

కాగా  2014  ఆర్థిక సంవత్సరానికి  13.5 కోట్ల డాలర్ల వేతనాన్నిఅందుకున్నఅరోరా  గతంలో గూగుల్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు.  నికేష్  అరోరా ఆధ్వర్యంలోనే  సాఫ్ట్ బ్యాంక్ భారత్ లో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు