స్పైస్‌జెట్‌లో సాంకేతిక సమస్య 

14 Feb, 2019 03:43 IST|Sakshi
విమానం ఆలస్యం కావడంతో ఆందోళనకు దిగిన ప్రయాణికులు   

ఏడున్నర గంటలు ఆలస్యంగా వెళ్లిన విమానం

సహనం కోల్పోయి ఆందోళనకు దిగిన ప్రయాణికులు  

సాక్షి, శంషాబాద్‌: విమానయాన సంస్థలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్‌ వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏడున్నర గంటలు ఆలస్యంగా బయలుదేరింది. స్పైస్‌జెట్‌ 753 విమానం బుధవారం ఉదయం 5.30 గంటలకు ఇక్కడి నుంచి టేకాఫ్‌ తీసుకోవాలి. ఈ సమయంలో విమానంలో సాంకేతిక లోపం గమనిం చిన పైలెట్‌ జెట్‌ను నిలిపివేశారు. ప్రయాణికులకు సరైన సమాచారం అందించకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు విమానంలోనే కూర్చోబెట్టారు.

దీంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు కిందికి దిగి ఆందోళన చేపట్టారు. విమానయాన సంస్థ నిర్వాహకులపై మండిపడ్డారు. విమానం ఆలస్యమైతే సమాచారం ఇవ్వకుండా, విశ్రాంతి గదులకు పంపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రయాణికుల ఆందోళనతో నిర్వాహకులు వారిని టెర్మినల్‌కు పంపారు. మరమ్మతుల అనంతరం విమానం 12.55 గంటలకు ఇక్కడి నుంచి టేకాఫ్‌ తీసుకుంది. పైలట్‌ రాకపోవడంతో ఈ నెల 9న సాయంత్రం 4.10 గంటలకు శంషాబాద్‌ నుంచి లక్నో వెళ్లాల్సిన ఇండిగో విమానం 5 గంటలు ఆలస్యంగా నుంచి టేకాఫ్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు