నేడు మార్కెట్లకు సెలవు

6 Apr, 2020 11:07 IST|Sakshi

సాక్షి, ముంబై: మహావీర్‌ జయంతి సందర్భంగా నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లకు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. ట్రేడింగ్‌ తిరిగి రేపు (మంగళవారం, ఏప్రిల్ 7)ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది. అలాగే బులియన్‌, మెటల్‌ తదితర హోల్‌సేల్‌ కమోడిటీ మార్కెట్లకూ నేడు పనిచేయవు. కమోడిటీ ఫ్యూచర్స్‌లో సైతం ట్రేడింగ్‌ను అనుమతించరు. ఇక ఫారెక్స్‌ మార్కెట్లకు కూడా నేడు మహావీర్‌ జయంతి సందర్భంగా సెలవుకాగా.. గత వారం సైతం రెండు రోజులపాటు పనిచేయలేదు. ఏప్రిల్‌ 1(బుధవారం) ఖాతాల వార్షిక(2019-20) ముగింపు రోజు సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్లకు సెలవు. మరుసటి రోజు గురువారం శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని సెలవు ప్రకటించారు. కాగా వారాంతంలో (శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు  అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్‌ 674 పాయింట్లు పతనమై 27,591 వద్ద,  నిఫ్టీ 170 పాయింట్లు క్షీణించి 8,084 వద్ద స్థిరపడింది. తద్వారా కీలక సూచీలురెండూ ప్రధాన మద్దతు స్థాయిలకు దిగువన ముగిసిన సంగతి విదితమే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా