లాభాల స్వీకరణ :వెనక్కి తగ్గిన సూచీలు

28 May, 2019 14:24 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస లాభాల తరువాత వెనక్కి తగ్గాయి. వరుసగా మూడో రోజు సానుకూలంగా ప్రారంభమైనా ఆటుపోట్లను ఎదుర్కొంటు న్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 71 పాయింట్లు క్షీణించి 39,612వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు నీరసించి 11,897వద్ద ట్రేడవుతోంది. లాభాల స్వీకరణ మార్కెట్లు ప్రభావితం చేస్తోంది. ఐటీ, మెటల్‌ 1 శాతం స్థాయిలో పుంజుకోగా బ్యాంక్‌ నిఫ్టీ అదేస్థాయిలో బలహీనపడింది.

నిఫ్టీ దిగ్గజాలలో యస్ బ్యాంక్‌, జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యూపీఎల్‌, హిందాల్కో, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, ఆర్‌ఐఎల్‌, విప్రో, టీసీఎస్‌ 4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే హీరో మోటో, ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, ఎయిర్‌టెల్‌, కొటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌ 3.5-1 శాతం మధ్య క్షీణించాయి.

మరిన్ని వార్తలు