వరుస నష్టాలు: 40 వేల వద్ద స్థిరపడుతుందా?

26 Feb, 2020 09:25 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం కూడా నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ ఆరంభంలోనే ఏకంగా 390పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 11700  స్థాయిని కోల్పోయింది.  అమ్మకాల ఒత్తిడి కొనసాగితే సెన్సెక్స్‌ 40 వేల స్థాయిని నిలబెట్టుకుంటుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దాదాపు 400 పాయింట్లు కుప్పకూలి 40వేల స్థాయిని కోల్పోయిన సెన్సెక్స్‌  ప్రస్తుతం సెన్సెక్స్‌  235  పాయింట్లు కుప్పకూలి, 40035 వద్ద,  నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయి 11727 వద్ద ఉంది.  ఐసీఐసీఐ, సన్‌ఫార్మా, భారతి ఇన్‌ఫ్రాటెల్‌  భారీగా నష్టపోతున్నాయి.  ఆర్‌బీఐ నిబంధనలు ఎత్తివేతతో బంధన్‌ బ్యాంకు టాప్‌ విన్నర్‌గా ఉంది.  దీంతోపాటు ఎఎఫ్‌సీజీ  షేర్లు మాత్రం లాభపడుతున్నాయి. బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా,ఎస్‌బీఐ స్వల్పంగా లాభపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు