లాభాల్లో స్టాక్‌మార్కెట్లు 

11 Sep, 2019 09:20 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి.  సెన్సెక్స్‌ 79 పాయింట్లు ఎగిసి 37224 వద్ద నిఫ్టీ19  పాయింట్ల లాభంతో 11019 వద్ద కొనసాగుతున్నాయి. ఎస్‌బ్యాంకు  దాదాపు 5 శాతం లాభాలతో  ట్రేడ్‌ అవుతోంది. పీఎస్‌యూ, బ్యాంకింగ్‌,  టెలికాం షేర్లు పాజిటివ్‌గా ఉండగా, ఐటీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌సెక్టార్‌ నష్టపోతోంది. అయిదు ప్లాంట్లలో 16రోజుల ఉత్పత్తి నిలిపివేత వార్తలతో అశోక్‌ లేలాండ్‌ భారీగా నష్టపోతోంది. టాటా  మోటార్స్‌  టాప్‌ విన్నర్‌గా ఉంది. ఇంకా ఓరియంట్‌, జెకే పేపర్‌ లాభపడుతున్నాయి.  గెయిల్‌, విప్రో, మారుతు సుజుకి, ఇన్ఫోసిస్‌, కోటక్‌మహీంద్ర బ్యాంకు బీహెచ్‌ఈఎల్‌, గెయిల్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ నష్టపోతున్నాయి.

అటు డాలరు మారకంలో రూపాయి బలహీనంగా  ట్రేడింగ్‌ను ఆరంభించింది. 0.14 శాతం నష్టంతో 71.84 వద్ద కొనసాగుతోంది.  సోమవారం 71.70 వద్ద ముగిసింది. మంగళవారం మొహర్రం సందర్భంగా మార్కెట్లకు సెలవు.

మరిన్ని వార్తలు