ట్రంప్‌ ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లలో జోష్‌..

9 Jan, 2020 09:57 IST|Sakshi

ముంబై : అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలతో బేజారైన స్టాక్‌ మార్కెట్లు గురువారం భారీగా పుంజుకున్నాయి. ఇరాన్‌ క్షిపణి దాడుల్లో అమెరికా బలగాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ట్రంప్‌ పేర్కొనడంతో పాటు శాంతి మంత్రం జపించడంతో ఈక్విటీ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల ఊతంతో మదుపుదారులు కొనుగోళ్లకు దిగడంతో కీలక సూచీలన్నీ లాభాల బాట పట్టాయి. ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారతి ఎయిర్‌టెల్‌ లాభపడుతుండగా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టపోతున్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 448 పాయింట్ల లాభంతో 41,264 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 136 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,161 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు