సిండికేట్ బ్యాంక్ లాభం రూ.79 కోట్లు

29 Jul, 2016 00:42 IST|Sakshi
సిండికేట్ బ్యాంక్ లాభం రూ.79 కోట్లు

ఆదాయం రూ.6,419 కోట్లు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.79 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.302 కోట్ల నికర లాభం సాధించామని సిండికేట్ బ్యాంక్ తెలిపింది. జైపూర్ రీజియన్‌కు చెందిన మూడు బ్యాంక్ శాఖల్లో జరిగిన మోసం కారణంగా ఈ మూడు శాఖల లావాదేవీలపై దర్యాప్తు జరుగుతోందని, పెద్ద మొత్తాన్ని  రద్దు చేసినందున ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను, గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని వివరించింది. 

మొత్తం ఆదాయం గత క్యూ1లో రూ.6,323 కోట్లుగానూ, ఈ క్యూ1లో రూ. 6,419 కోట్లుగానూ నమోదైందని పేర్కొంది. గత క్యూ1లో 3.72 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 7.53 శాతానికి, అలాగే 2.36 శాతంగా ఉన్న నికర మొండిబకాయిలు 5.04 శాతానికి పెరిగాయని పేర్కొంది. అంతర్జాతీయ వ్యాపారం రూ.4.72 లక్షల కోట్ల నుంచి రూ.4.68 లక్షల కోట్లకు, అలాగే అంతర్జాతీయ డిపాజిట్లు రూ.2.69 లక్షల కోట్ల నుంచి రూ.2.63 లక్షల కోట్లకు తగ్గాయని తెలిపింది. బీఎస్‌ఈలో సిండికేట్ బ్యాంక్ షేర్ 1.3 శాతం లాభంతో రూ.77 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు