టాటా నెక్సాన్‌ క్రేజ్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌

6 Sep, 2018 11:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నెక్సాన్‌ వార్షికోత్సవ కానుకగా  ఎడిషన్‌  నెక్సాన్‌ కారును టాటా మోటార్స్‌ లిమిటెడ్‌  విడుదల చేసింది. కాస్మోటిక్‌ అపడేట్స్‌ తో రెండు వేరియంట్లను లాంచ్‌ చేసింది.   టాటా నెక్సాన్‌   క్రేజ్‌గా  పిలుస్తున్న ఈ కారునురెండువేరియంట్లను తీసుకొచ్చింది. నెక్సాన్‌ క్రేజ్‌, నెక్సాన్‌ క్రేజ్‌ప్లస్‌ పేరుతో పెట్రోల్‌, డీజిల్‌ వెర్షన్‌లలో విడుదల చేసింది.   యాక్టివ్‌, స్టోర్టివ్‌ కస‍్టమర్లకోసం నియాన్‌ గ్రీన్‌ కలర్‌తో  నెక్సాన్‌ క్రేజ్‌ను ఆకర్షణీయంగా తీసుకొచ్చామని టాటా  మోటార్స్‌  ప్రెసిడెంట్‌ మయాంక్‌ పారీక్‌ వెల్లడించారు.  దీని ద్వారా ఈ  సెగ్మెంట్‌లో కొత్త ట్రెండ్‌ సృష్టించనున్నా‍మన్నారు.

ధరలు:  (ఎక్స్‌ షోరూం న్యూఢిల్లీ)
నెక్సాన్‌ క్రేజ్‌ (పెట్రోల్‌) ధర. 7.14 లక్షలు
నెక్సాన్‌ క్రేజ్‌ (డీజిల్‌‌) ధర. 8.07 లక్షలు
నెక్సాన్‌ క్రేజ్‌ ప్లస్‌  (పెట్రోల్‌) ధర. 7.76 లక్షలు
నెక్సాన్‌ క్రేజ్‌ ప్లస్‌ (డీజిల్‌‌) ధర. 8.64 లక్షలు

నియోన్‌ గ్రీన్‌  కలర్‌తో సిల్వర్ డ్యూయల్ టోన్ రూఫ్‌,  ఓఆర్‌వీఎం లు, ఫ్రంట్‌ గ్రిల్ ఇన్సర్ట్, వెనుకవైపు నియోన్‌గ్రీన్‌ క్రేజ్‌ బ్యాడ్జింగ్ లాంటి కాస్మొటిక్‌ అపడేట్స్‌తో  పాటు, వీల్స్‌మీద కూడా నియోన్‌ గ్రీన్‌ కలర్‌ జోడించింది. ఇక క్యాబిన్ లోపల, డాటాబోర్డు, డోర్‌, స్టీరింగ్, కన్సోల్ ఫినిషర్స్   పియానో బ్లాక్ ఫినిషింగ్‌, నియోన్‌ గ్రీన్‌ కలర్స్‌ . 4 స్పీకర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా లభ్యం.  

ఇంజీన్‌
1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 110పీఎస్‌,   170ఎన్‌ఎం ఉత్పత్తి చేస్తుంది
1.5 లీటర్ డీజిల్ 110పీఎస్‌,  260ఎంఎచ్‌ ఉత్పత్తి రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యూల్‌ ట్రాన్స్‌మిషన్‌

మరిన్ని వార్తలు