టీసీఎస్‌ సీఈఓకు రూ. 16 కోట్ల వేతనం

17 May, 2019 02:56 IST|Sakshi

గతేడాది 28% పెరుగుదల

న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ గోపీనాథన్‌ వేతనం 28 శాతం పెరిగింది. ఏడాది జీతం రూ.16 కోట్లు దాటింది. రాజేష్‌ గోపీనాథన్‌కు గతేడాదిలో ఈ మొత్తాన్ని వేతనంగా చెల్లించినట్లు సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. చెల్లింపుల వివరాల్లోకి వెళితే.. జీతం రూ.1.15 కోట్లు, అదనపు ప్రయోజనం రూ.1.26 కోట్లు, కమీషన్‌ రూ.13 కోట్లు, అలవెన్సులు రూ.60 లక్షలు కలిపి మొత్తంగా 16.02 కోట్ల రూపాయిలు చెల్లించింది. 2017–18లో ఈయనకు చెల్లించిన మొత్తం రూ.12.49 కోట్లతో పోల్చితే గతేడాది వేతనం 28 శాతం పెరిగింది. ఇక సీఓఓ ఎన్‌ గణపతి సుబ్రహ్మణ్యం వేతనం రూ.11.61 కోట్లు (24.9 శాతం పెంపు), సీఎఫ్‌ఓ రామకృష్ణన్‌ వేతనం రూ.4.13 కోట్లుగా వెల్లడించింది. ఉద్యోగుల జీతాల్లో 2 నుంచి 5 శాతం పెంపు ఉన్నట్లు ప్రకటించింది. 

మరిన్ని వార్తలు