టెల్కోల ఆదాయం 15% డౌన్‌

6 Jul, 2017 01:11 IST|Sakshi
టెల్కోల ఆదాయం 15% డౌన్‌

ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో
న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్లు సర్వీసుల నుంచి పొందే ఆదాయం ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 15 శాతం తగ్గుదలతో రూ.40,831 కోట్లకు క్షీణించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.48,379 కోట్లుగా ఉంది. ఈ విషయాలను టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది.

దీని ప్రకారం.. వార్షిక ప్రాతిపదికన చూస్తే స్థూల ఆదాయం (జీఆర్‌), సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్‌) వరుసగా 7.35 శాతం, 15.60 శాతం క్షీణించాయి. కంపెనీకి అన్ని విభాగాల నుంచి వచ్చిన ఆదాయాన్ని స్ధూల ఆదాయం అని, కేవలం టెలికం సర్వీసుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సర్దుబాటు స్థూల ఆదాయం అని పేర్కొంటాం.

మరిన్ని వార్తలు