హార్లే డేవిడ్సన్‌లో రెండు కొత్త మోడళ్లు 

1 Mar, 2018 00:46 IST|Sakshi
లో రైడర్‌@రూ.12.99 లక్షలు డీలక్స్‌@రూ.17.99 లక్షలు

న్యూఢిల్లీ: విలాసవంతమైన బైక్‌లు తయారు చేసే అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్‌ కంపెనీ సాఫ్టైల్‌ పోర్ట్‌ఫోలియోలో రెండు కొత్త మోడళ్లు– లో రైడర్, డీలక్స్‌లను భారత మార్కెట్లోకి తెచ్చింది. లో రైడర్‌ మోడల్‌ ధర రూ.12.99 లక్షలని, డీలక్స్‌ ధర రూ.17.99 లక్షలని హార్లే డేవిడ్సన్‌ ఇండియా, చైనా ఎమ్‌డీ పీటర్‌ మ్యాక్‌ కోంజీ తెలిపారు. ఈ రెండు బైక్‌లను 1745 సీసీ మిల్‌వాకీ–ఎయిట్‌ 107 ఇంజిన్‌తో రూపాందించామని పేర్కొన్నారు.

ఈ  రెండు బైక్‌ల్లో డ్యుయల్‌–బెండింగ్‌ వాల్వ్‌ ఫ్రంట్‌ సస్పెన్షన్, వెనక భాగంలో అడ్జెస్ట్‌ చేసుకునే మోనోషాక్‌ అబ్జార్బర్స్‌ ఉన్నాయని తెలిపారు.మై18 సాఫ్టైల్‌ మోడళ్లను గత ఏడాది అక్టోబర్‌లో అందుబాటులోకి తెచ్చామని, తాజాగా ఇప్పుడు మరో రెండు మోడళ్లను అందిస్తున్నామని మ్యాక్‌ తెలిపారు. కాగా హార్లే డేవిడ్సన్‌ కంపెనీ టూరింగ్, సీవీఓ మోడళ్ల ధరలను సవరించింది.  ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.  

మరిన్ని వార్తలు