ఎఫ్‌ఐఐల రాకతో రూపాయిలో స్థిరత్వం

10 Jun, 2020 12:53 IST|Sakshi

కలిసొచ్చిన క్రూడాయిల్‌ పతనం 

పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

గత రెండు నెలలుగా భారీ పతనాన్ని చవిచూసిన రూపాయి ఇటీవల సిర్థత్వాన్ని సంతరించుకుంది.  దేశీయ స్టాక్‌ మార్కెట్లో విదేశీ ఇన్వెసర్లు తిరిగి కొనుగోళ్లు జరపడం ఇందుకు కారణమని ఫారెక్స్‌ విశ్లేషకులంటున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర పతనం, ఫారెక్స్‌ నిల్వలు వరుసగా 5వారంలోనూ కొత్త జీవితకాల గరిష్టానికి చేరుకోవడం లాంటి అంశాలు రూపాయి స్థిరమైన ట్రేడింగ్‌కు కారణమైనట్లు వారు చెప్పుకొచ్చారు. 

ఎక్చ్సేంజ్‌ రేట్‌ స్థిరత్వం అనేది అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అత్యంత కీలకమైన అంశం. మూలధన కేటాయింపు నిర్ణయాలలో ఇది చెప్పుకొదగిన పాత్ర పోషిస్తుంది. లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత, కరెన్సీ ట్రేడింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటలకు వరకే కుదించారు. 

‘‘ కొన్ని ప్రత్యేక కారణాల కలయికలు రూపాయి స్థిరమైన రాణింపునకు తోడ్పాటును అందించాయి. అంతర్జాతీయంగా చైనా యువాన్‌ బలపడటం, డాలర్‌ ఇండెక్స్‌ పతనం దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఐఐ ప్రవాహాలు పెరిగేందుకు సహకరించాయి. ఇటీవల పెద్ద కార్పొరేట్ సం‍స్థలు వాటా అమ్మకాలతో పాటు రైట్స్‌ ఇష్యూలు, ఎఫ్‌డీఐలు స్థానిక కరెన్సీకి డిమాండ్‌ను పెంచాయి. దీంతో ఎఫ్‌పీఐలు స్థానిక మర్కెట్లలో నిధుల సమీకరణను ప్రారంభించాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లు రైట్స్‌ ఇష్యూ, క్యూఐపీల పద్దతిలో 9బిలియన్‌ డాలర్లను సమీకరించాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెసర్లు రూపాయి ఆధారిత ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి డాలర్లను తీసుకువచ్చారు.’’ అని గ్లోబల్‌ ట్రేడింగ్‌ సెంటర్‌ విశ్లేషకుడు కునాల్‌ శోభిత తెలిపారు. 

దాదాపు 2నెలల తర్వాత లాక్‌డౌన్‌ సడలింపులతో ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్‌ ఇన్వెస్టర్లు రిస్క్‌-అసెట్స్‌లైన ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. భారత ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఐఐలు గడచిన 7రోజుల్లో 3బిలియన్‌ డాలర్ల కొనుగోళ్లు చేశారు. మార్చి నెలలో దాదాపు 7.7బిలియన్‌ డాలర్ల అమ్మకాలు జరిపారు. ఏప్రిల్‌లో అర బిలియన్‌ డాలర్లుగానూ ఉన్నాయి. తైవాన్‌, సౌత్‌ కొరియా దేశాల ఈక్విటీ మార్కెట్లలో జరిపిన కొనుగోళ్ల కంటే అధికంగా ఉండటం విశేషం.  

‘‘కరోనా వైరస్‌ అంటువ్యాధి భయాందోళనలు క్రమంగా అంతరించిపోతుండటం ఇన్వెసర్లకు కలిసొస్తుంది. త్వరలో వ్యాపారాలు సాధారణ స్థాయికి చేరుకొవచ్చనే ఆశావమన అంచాలు వారిలో నెలకొన్నాయి. వైరస్‌ వ్యాప్తి కట్టడికి భారత్‌ తీసుకుంటున్న చర్యలు రూపాయి స్థిరత్వం పొంది డాలర్లను పొందడంలో సహాయపడుతుంది.’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌లో రూపాయి అనలిస్ట్‌ హెచ్‌ అనిక్ద బెనర్జీ అభిప్రాయపడ్డారు.  

ఫారెన్‌ ఎక్చ్సేంజ్‌ నిల్వలు వరుసగా 5వారం కొత్త గరిష్టానికి చేరుకుంది. మార్చి 29తో ముగిసిన వారంలో మొత్తం 493 బిలియన్‌ డాలర్ల విలువైన నిల్వలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ డాలర్ల కొనుగోలు చేయడంతో నిల్వలు పెరినట్లు డీలర్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు