షియోమీ మొబైల్ కంపెనీకి భద్రత ముప్పు!

25 Oct, 2014 00:53 IST|Sakshi
షియోమీ మొబైల్ కంపెనీకి భద్రత ముప్పు!
బీజీంగ్: అంతర్గత భద్రతకు ముప్పుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో  చైనా మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ తగిన చర్యలు తీసుకుంటోంది. చైనా దేశస్తులు కాని కస్టమర్లకు సంబంధించిన డేటాను తమ సర్వర్ల నుంచి ఇతర దేశాల్లోని తమ సర్వర్లకు తరలించడానికి నిర్ణయం తీసుకుంది. కాలిఫోర్నియా, సింగపూర్ లోని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్లకు డేటాను తరలించే పనిలో షియోమీ పడింది. 
 
ఈ తరలింపు కార్యక్రమం ఈ సంవత్సరం తొలినాళ్ల నుంచే ప్రారంభినట్టు, అక్టోబర్ చివరకల్లా పూర్తవుతుందని షియోమీ కంపెనీ వెల్లడించింది. గత కొద్ది సంవత్సరాలుగా కొత్త మార్కెట్లలో వ్యాపారాన్ని విస్తరించామని, ఇప్పటికే సింగపూర్, తైవాన్ దేశాల్లో వెబ్ సైట్ స్పీడ్ పెరిగిన విషయాన్ని యూజర్లు గుర్తిస్తున్నారని కంపెనీ తెలిపింది. 
 
భారత్ విషయానికి వస్తే 200 శాతం యూజర్లు పెరిగినట్టు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. స్టాటిక్ పేజీల లోడ్ సంబంధించిన అంశంలో వేగం పెంచడానికి సరికొత్త అకమాయ్ గ్లోబల్ సీడీఎన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను ఊపయోగిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
మరిన్ని వార్తలు