యస్‌బ్యాంక్‌ షేరు 20శాతం క్రాష్‌..!

23 Jul, 2020 13:45 IST|Sakshi

4రోజూ నష్టాలే...

2వారాల్లో 45శాతం డౌన్‌

ఆదుకోలేకపోయిన నిధుల సమీకరణ

ప్రైవేట్‌ రంగ దిగ్గజం యస్‌బ్యాంక్‌ షేరు గురువారం ట్రేడింగ్‌లో 20శాతం నష్టపోయింది. ఈ షేరుకు ఇది వరుసగా 4రోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం విశేషం. మార్కెట్‌ ప్రారంభం నుంచే ఈ షేరు కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో 20శాతం​నష్టంతో రూ.14.60 వద్ద ప్రారంభమైంది. ఏకంగా 20శాతం నష్టంతో షేరు లోయర్‌ సర్కూ‍్యట్‌ వద్ద ఫ్రిజ్‌ అయ్యింది. అనంతరం రిలీజైన్‌ షేరుకు ఎలాంటి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. 

ఇటీవల యస్‌ బ్యాంక్‌ ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పీఓ) పద్దతిలో రూ.15,000 కోట్లు సమీకరించిన్పటి నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. నిధుల సమీకరణపై ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ సానుకూల వ్యాఖ్యాలు షేరు పతనాన్ని ఆపలేకపోయాయి. నిధుల విజయవంతం కావడంతో బ్యాంకు క్రిడెట్‌ రేటింగ్‌ మరింత మెరుగుపడుతుందని, రుణదాతల డిఫాల్ట్‌ నష్టాలను తగ్గిస్తుందని మూడీస్‌ రేటింగ్‌ తన నివేదికలో పేర్కోంది. 

మిడ్‌సెషన్‌ సమయానికి యస్‌బ్యాంక్‌ షేరు 15శాతం నష్టంతో రూ.15.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. గడచిన 2వారాల్లో షేరు 45శాతం నష్టాన్నిచవిచూసింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.5.55, రూ.98.65గా ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు