కాల్ డ్రాప్ కష్టాలు...

21 Apr, 2018 11:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కాల్‌డ్రాప్స్‌తో వినియోగదారుల అవస్థలు

భారీగా పెరుగుతున్న సెల్‌ఫోన్‌ వాడకందారులు

ఏపీ సర్కిల్‌లో 8 కోట్లు దాటిన మొబైల్‌ వినియోగదారులు

అందుకు అనుగుణంగా పెరగని టవర్ల సామర్థ్యం

పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని 4జీ టవర్లు

సాక్షి, అమరావతి : విజయవాడలో ఉంటున్న నరేంద్రకు ఆఫీసు నుంచి ముఖ్యమైన ఫోన్‌ వచ్చింది. ఇంట్లో ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడుతుంటే అవతలి వైపు వారికి తన మాట వినిపించడం లేదు. ఫోన్‌ కట్‌ చేసి బయటకు వచ్చి తిరిగి కాల్‌ చేస్తే కలవటం లేదు. దాదాపు ప్రతి సెల్‌ఫోన్‌ వినియోగదారుడు ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొంటున్న అనుభవం ఇది. కొందరైతే సిగ్నల్స్‌ అందక బయటకు లేదా ఇంటిపైకి పరిగెత్తాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఖాతాదారులను పెంచుకోవడంపై చూపుతున్న శ్రద్ధను టవర్ల సంఖ్యపై కూడా చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

టవర్లు తగినన్ని లేకనే..
రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న మొబైల్‌ వాడకందారులకు అనుగుణంగా మౌలిక వసతులను పెంచడంలో సెల్‌ఫోన్‌  ఆపరేటర్లు విఫలమవుతున్నారు. ఖాతాదారుల సంఖ్యకు తగినట్టుగా టవర్లు, సామర్థ్యం పెంచకపోవడంతో కాల్‌డ్రాప్స్‌ ఎక్కువవుతున్నాయి. కాల్‌డ్రాప్స్‌ను అరికట్టేందుకు ‘ట్రాయ్‌’ ఎన్ని పెనాల్టీలు విధిస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావట్లేదు. సబ్‌స్క్రైబర్స్‌ అధికంగా ఉన్న సెల్యూలర్‌ సంస్థల్లో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. వారం క్రితం నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఖాతాదారులు ఇబ్బంది ఎదుర్కొన్న మాట వాస్తవమేనని, దీన్ని వెంటనే సరిదిద్దినట్లు ఐడియా ఏపీ సర్కిల్‌ హెడ్‌ బి.రామకృష్ణ తెలిపారు. వొడాఫోన్‌ను టేకోవర్‌ చేయడం వల్ల ఆ ఖాతాదారులు ఐడియాలోకి మారటంతో కూడా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు.

పోటాపోటీగా ఆఫర్లు
సెల్‌ఫోన్‌ కంపెనీల మధ్య పోటీ పెరిగి ఆఫర్లు ప్రకటిస్తుండటంతో ప్రతి నెలా సబ్‌స్క్రైబర్స్‌ భారీగా పెరుగుతున్నారు. కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించిన ఓ కంపెనీ ధాటిని తట్టుకుని ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు ఇతర ఆపరేటర్లు పోటీపడి ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దీనివల్ల ఖాతాదారుల సంఖ్య పెరుగుతున్నా ఆదాయం తగ్గిపోతోందని కంపెనీలు చెబుతున్నాయి.

 హైస్పీడ్‌ లేదు... 2జీనే
సెల్‌ఫోన్‌ కంపెనీలు చెబుతున్న హైస్పీడ్‌ డేటా కేవలం ప్రచారానికే పరిమితమవుతోందని, పలు సందర్భాల్లో 2 జీ స్పీడు కూడా ఉండటం లేదని ఖాతాదారులు వాపోతున్నారు. అన్‌లిమిటెడ్‌ డేటా ప్యాక్‌లు ప్రకటిస్తుండటంతో వినియోగం భారీగా పెరిగి పీక్‌ సమయాల్లో వేగం తగ్గిపోతోంది. 4 జీ టవర్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే కానీ డేటా స్పీడ్‌ పెరిగే అవకాశం లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఐడియా సెల్యూలర్‌కు 11,000కి పైగా 2జీ టవర్లు ఉంటే 3జీ టవర్లు సుమారు 9,000 ఉన్నాయి. ఐడియా 4 జీ టవర్లు కేవలం 8,000 మాత్రమే ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ అనుమతి లేనందున ఇతర సంస్థల స్పీడ్‌తో పోల్చి చూడకూడదని ఓ ఉన్నతాధికారి చెప్పారు.

8 కోట్లుదాటిన వాడకం దారులు
ప్రస్తుతం ఏపీ సర్కిల్‌లో (ఏపీ, తెలంగాణ) ప్రైవేట్‌ సెల్‌ఫోన్‌ కంపెనీల ఖాతాదారుల సంఖ్య 7.02 కోట్లకు చేరింది. దీనికి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఖాతాదారులను కూడా కలిపితే 8 కోట్లు దాటుతోంది. కంపెనీల మధ్య పోటీ పెరిగి ఆఫర్లు ప్రకటిస్తుండటంతో లాభాలు తగ్గి సామర్థ్యం పెంచుకోలేకపోతున్నాయి. దీనికి తోడు కొత్త టవర్ల ఏర్పాటుకు అనుమతులు రాక  ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆపరేటర్లు చెబుతున్నారు. కాలనీల మధ్యలో వెలుస్తున్న ఎత్తైన అపార్ట్‌మెంట్ల వల్ల కూడా సిగ్నల్స్‌కు అంతరాయం కలుగుతోందని,  ఇలాంటి సందర్భాల్లో ఫిర్యాదు అందగానే టవర్ల ఫ్రీక్వెన్సీని  మారుస్తున్నట్లు టెలికాం అధికారులు పేర్కొంటున్నారు.

7.02కోట్లు
ప్రైవేట్‌ సెల్‌ఫోన్‌ కంపెనీల ఖాతా దారుల సంఖ్య

Read latest Corporate News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దిగ్గజ స్టార్టప్‌కు ప్రేమ్‌జీ ఊతం

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

సుజుకి జిక్సెర్‌ కొత్త బైక్‌..

హోండా ‘డబ్ల్యూఆర్‌–వీ’ కొత్త వేరియంట్‌

మెహుల్‌ చోక్సీ ఆస్తులు ఈడీ జప్తు

రుణ ప్రణాళికకు బ్యాంకర్లు ఓకే

రుణాల విషయంలో జాగ్రత్తగా ఉంటాం

భూముల అమ్మకంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఊపిరి!

ఎయిరిండియాను అమ్మేసినా దేశీ సంస్థల చేతుల్లోనే

కళ్యాణి రఫేల్‌కు భారీ కాంట్రాక్టు

హైదరాబాద్‌లో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రెండో సెంటర్‌

మెహుల్‌ చోక్సీకి ఎదురు దెబ్బ

పదివేల టవర్లతో​ ఏపీలోదూసుకుపోతున్న జియో

మహిళా ఉద్యోగులు రెట్టింపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌