అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి పదేళ్ల జైలు 

13 Jan, 2018 18:31 IST|Sakshi

సాక్షి, కోలారు : బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కర్ణాటకలోని కోలారు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి శనివారం తీర్పు చెప్పారు. కోలారు నగరంలోని కేజీ మోహల్లా వాసి వాజిద్‌ఖాన్‌ 2015 జనవరి 31న అదే ప్రాంతానికే చెందిన ఓ బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో సెషన్స్‌ న్యాయమూర్తి బి.ఎస్‌.రేఖ నిందితుడికి పైవిధంగా జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. 

మరిన్ని వార్తలు