యూపీలో 218 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

9 Dec, 2019 13:23 IST|Sakshi

లక్నో : ఉన్నావ్‌ అత్యాచారం, హత్య ఘటన అనంతరం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 218 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయడానికి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ఈ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఉన్నావ్‌ బాధితురాలు మరణానంతరం ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో యోగి ప్రభుత్వం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు ఆయోద ముద్ర వేసింది. ఈ క్రమంలో.. అత్యాచారం కేసులను విచారించడానికి 144 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను, పిల్లలపై నేరాలకు సంబంధించిన కేసులను విచారించడానికి 74 కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.

>
మరిన్ని వార్తలు