బాలుడి కిడ్నాప్‌

6 Jan, 2018 09:11 IST|Sakshi

తీవ్రంగా కొట్టి వదిలేసిన దుండగుడు

పోలీసుల అప్రమత్తత.. ఆస్పత్రిలో కిత్సపొందుతున్న చిన్నారి

కడప కార్పొరేషన్‌: కడప నగరం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన దేవేంద్రారెడ్డి(4) అనే ఎల్‌కేజీ విద్యార్థి శుక్రవారం సాయంత్రం కిడ్నాప్‌ అయ్యాడు. ఈ వార్త నగరంలో కలకలం రేపింది. డీఎస్పీ మాసూం బాషా కథనం ప్రకారం.. హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన పవన్‌కుమార్‌రెడ్డి ఇంట్లోనే ల్యూమినస్‌ బ్యాటరీల షాపు నిర్వహిస్తున్నాడు. గుత్తికి చెందిన వినోద్‌ ఆ షాపులో గుమస్తాగా పని చేస్తున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో వినోద్‌.. యజమాని కుమారుడు దేవేంద్రారెడ్డిని కిడ్నాప్‌నకు పాల్పడ్డారు. ఆ బాలుడిని మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని రిమ్స్‌ వైపు తీసుకెళ్లారు. వేరే నంబర్‌తో పవన్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌ చేసి.. గొంతు మార్చి మాట్లాడుతూ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. బాలుడి తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అప్రమత్తమయ్యారు. పవన్‌కుమార్‌రెడ్డికి వచ్చిన ఫోన్‌ నంబర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొరికిపోతాననే భయంతో వినోద్‌.. బాలుడిని రిమ్స్‌ రోడ్డులోని బొరుగుల ఫ్యాక్టరీ సమీపంలో బండకేసి బాదారు.

దీంతో పిల్లవాడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. అక్కడే వదిలేశాడు. తర్వాత ఏమీ తెలియనట్లు షాపునకు వచ్చేశాడు. అయితే వన్‌టౌన్‌ పోలీసులు శుక్రవారం రాత్రి నగరంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాజీÐŒవ్‌ పార్కు సమీపంలోని బాలుడి ఇంటి వద్ద విచారణ చేపట్టారు. దుకాణంలో పని చేసే వారి గురించి ఆరా తీసే సమయంలో.. వినోద్‌ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేయగా.. బాలుడిని చంపినట్లు తెలిపారు. అయితే తండ్రి పవన్‌కుమార్‌రెడ్డి తమ బిడ్డ మృతదేహాన్నైనా చూస్తామని అడగ్గా.. బొరుగుల ఫ్యాక్టరీ వద్ద పడవేశామని చెప్పాడు. అక్కడికి వెళ్లి చూడగా బాలుడు కదలాడుతూ ఉండటంతో వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలుడు పరిస్థితి పర్వాలేదని, అపాయమేమీ లేదని వైద్యులు తెలిపారు. తలకు మాత్రం పెద్ద గాయమైనట్లు సమాచారం. కిడ్నాప్‌నకు గురైన విద్యార్థి దొరకడంతో తల్లిదండ్రులు కుదుట పడ్డారు. తమ వద్ద పని చేసే వారే ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తారని అనుకోలేదని వారు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు