కోర్టు ఆదేశాలు.. అసదుద్దీన్‌పై కేసు నమోదు

13 Mar, 2020 14:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై పాతబస్తీ మొగల్‌పుర పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అసదుద్దీన్‌పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కర్ణాటకలో ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్‌ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇక్విలాబ్‌ మిలత్‌ పార్టీ నేత బల కిషన్‌రావు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అసదుద్దీన్‌తోపాటు ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్‌ పఠాన్‌ కేసు నమోదు చేయాలని పోలీసులు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అసదుద్దీన్‌పై 153, 153(ఏ), 117, 295(ఏ), 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు మొగల్‌పుర పోలీసులు వెల్లడించారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు