కరోనాపై కీలక నిర్ణయం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం

13 Mar, 2020 14:50 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రపంచ వ్యాప్తంగా మరణమృదంగాన్ని మోగిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)ను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక చర్యలను చేపడుతోంది. కరోనా నివారణకు ఇప్పటికే ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వైరస్‌ ఉధృతి దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకోనుంది. కరోనా వైద్యానికి ప్రత్యేక నియంత్రణా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నియంత్రణ నోటీస్‌ను జారీ చేయనుంది. దీనిలో భాగంగా కరోనా లక్షణాలు ఉన్నవారికి నిర్బంధ వైద్యం అందించేందుకు వైద్య అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీని కొరకు 1897 చట్టాన్ని ఉపయోగించాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీడీమిక్‌ డీసీజస్‌ చట్టం కింద నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. కరోనా వైరస్‌ వేగంవంతంగా విజృభిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటించేలా నోటిఫికేషన్ ఇవ్వనుంది. (ఏపీ: కరోనాపై మరింత అప్రమత్తం)

మరిన్ని వార్తలు