ప్రముఖ టీవీ నటుడిపై కేసు నమోదు

7 Jul, 2018 17:10 IST|Sakshi
బెంగాలీ నటుడు జాయ్‌ ముఖర్జీ

కోల్‌కతా : ప్రముఖ బెంగాలీ నటుడు జాయ్‌ ముఖర్జీని శనివారం అరెస్టు చేసినట్లు కోల్‌కతా పోలీసులు తెలిపారు. జాయ్‌ ముఖర్జీ తనపై భౌతిక దాడికి పాల్పడ్డాడంటూ నటి సయాంతిక బెనర్జీ చేసిన ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సయాంతిక​, ఆమె సహాయకుడు జిమ్‌ నుంచి కారులో వస్తున్న సమయంలో వారిని వెంబడించిన జాయ్‌ పలుమార్లు తన కారుతో ఢీకొట్టాడు. అనంతరం కారును ఓవర్‌టేక్‌ చేసి సయాంతికను కారులో నుంచి బయటికి లాగి ఆమెపై దాడి చేశాడు.

ఈ ఘటనపై సయాంతిక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రాష్‌ డ్రైవింగ్‌, ఉద్దేశపూర్వకంగా గాయపరిచిన కారణంగా ఐపీసీ 279, 341, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అతడిని ఎయిర్పూర్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా సయాంతిక పలు బెంగాలీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. టీవీ నటుడిగా మంచి గుర్తింపు పొందిన జాయ్‌ ముఖర్జీ.. సయాంతిక జంటగా రెండు సినిమాల్లో కనిపించారు.

మరిన్ని వార్తలు