రాజా, కనిమొళికి నోటీసులు..

21 Mar, 2018 12:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 2జీ కుంభకోణంలో టెలికంశాఖ మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు ఇతర నిందితులకు ఢిల్లీ హైకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. 2జీ స్కాంలో రాజా, కనమొళిని నిర్దోషులుగా ప్రకటిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టు  తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వారిని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది. సీబీఐ అభ్యర్థనపై విచారణ ప్రారంభించిన హైకోర్టు.. ఇప్పటివరకు నిందితులకు సంబంధించి ఈడీ, పీఎంఎల్‌ఏ అటాచ్‌ చేసిన ఆస్తుల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. గత ఏడాది డిసెంబర్‌ 21న 2జీ కేసులో కనిమొళి, రాజాలకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ.. వారిని నిర్దోషులుగా కింది కోర్టు ప్రకటించింది.

కింది కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించడంపై టెలికం మాజీ మంత్రి ఏ రాజా స్పందించారు. సీబీఐ అప్పీలుకు వెళ్లడం సాధారణ పరిణామమేనని, ఇది తాము ఊహించిందేనని, ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు