16 Dec, 2017 20:18 IST|Sakshi

పూతలపట్టు: అనారోగ్యంతో ఓ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు పల్లె వీధిలో శనివారం జరిగింది. పల్లె వీధికి చెందిన ఎ.రవికుమార్‌(45) పుంగనూరులో ఎక్సైజ్‌ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా విధులకు వెళ్లడం లేదు. శక్రవారం కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో ఎలుకల మందు తాగాడు. అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పూతలపట్టు ఎస్‌ఐ మురళీమోహన్‌ దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు