నకిలీ బంగారం అంటగట్టి ఉడాయిస్తారు’

7 Feb, 2019 09:23 IST|Sakshi
వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ శ్రీనివాస్‌

అమీర్‌పేట: అమాయకులను గుర్తించి నకిలీ బంగారం అంటగట్టి లక్షలు గడిస్తున్న  ముగ్గురిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.నిందితుల వద్ద నుంచి నకిలీ ఆభరణాలతో పాటు రూ.8.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ వివరాలను వెల్లడించారు.మహారాష్ట్రలోని చాలీస్‌ గావ్‌కు చెందిన  నతుల్లాల్‌ రాయ్‌(58), ఆర్జున్‌రాయ్‌(23),  రవికుమార్‌(26) లు ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకంగా కనిపించే చిరు వ్యాపారులను ఎంచు కుని వారికి నకిలీ బంగారం అంటగడుతూ లక్షల డబ్బులు గడిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. నగరంలో సంచరిస్తూ ముందుగా రెక్కీ నిర్వహిస్తూ చిరువ్యాపారులను ఎంపిక చేస్తారు. వారితో మాటలు కలిపి తాము పొలాల్లో జేసీబీ పనులు చేస్తుంటామని,పనులు చేస్తుండగా పెద్ద మొత్తంలో బం గారం దొరికిందని భారీ స్థాయిలో నకిలీ బంగారు హారాలు చూపిస్తారు.

ఆర్థిక సమస్యల కారణంగా బం గారు ఆభరణాలు విక్రయించాలని నిర్ణయించుకున్నామని నమ్మించేవారు. అనుమానం ఉంటే పరీక్షించుకోవాలని వ్యాపారులు దృష్టి మరల్చి కొంత అసలు బంగారం తీసి ఇస్తారు. దాని పరీక్షించగా అసలు బంగారం అని తేలడంతో మిగిలిన బంగారాన్ని మార్కెట్‌లో ఉన్న ధర కంటే చౌక ధరకు బాధితులకు అంటగట్టి ఉడాయిస్తారు. అసలు బం గారం అనుకుని హారాన్ని మరో సారి పరీక్షించి అది నకిలీదని తేలడంతో మోస పోయామని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు చోట్ల ,జీడిమెట్లలో మరో చోట చిరు వ్యాపారులకు నకిలీ బంగారం అంటగట్టి లక్షల నగదుతో ఉడాయించేవారు.తరువాత వారి ఫోన్‌ నెంబర్లను కూడా మార్చివేస్తారు. ఇటీవల మధురానగర్‌లోని ఓ జ్యూస్‌ షాపు నిర్వాహకుడిని మోసం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న క్రైం పోలీసులు డీఎస్‌ఐ ఎన్‌. సంజేయ్‌కుమార్‌ నేతృత్వంలో  క్రైం సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు.నిందితుల వద్ద నుంచి నకిలీ బంగారు ఆభరణాలతో పాటు రూ.8.5లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సిబ్బందిని డీసీపీ అభినందించారు. ఏపీసీ విజయ్‌కుమార్, ఎస్‌ఆర్‌నగర్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎస్‌.మురళీకృష్ణ,డిటెక్టీవ్‌ ఇన్స్‌పెక్టర్‌ వై.అజేయ్‌కుమార్,సబ్‌  ఇన్స్‌పెక్టర్‌ సంజేయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కారులో శవమై కనిపించిన చిన్నారి

ప్రేయసి పెళ్లి చేసుకోమని అడిగిందని..

బెల్లంకొండ కళాశాలపై కేసు

ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు

క‌రోనా సోకిందని యువతికి వేధింపులు, అరెస్ట్‌

సినిమా

కుకింగ్‌.. క్లీనింగ్‌

రుచి...వాసన తెలియడంలేదు

పిల్లలు పస్తులు ఉండకూడదు

కరోనా దగ్గర చేసింది!

నా ఇంటిని ఆస్పత్రిగా మార్చండి

కరోనాపై వార్‌ : ప్రభాస్‌, ఎన్టీఆర్‌ భారీ విరాళం