గౌతమి హత్యకేసుపై స్పందించిన కారుమూరి

27 Jun, 2018 18:41 IST|Sakshi
శ్రీగౌతమి పోటో ఫైల్‌

సాక్షి, కృష్ణా : రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు భావించిన ఎంబీఏ విద్యార్థిని గౌతమి మృతి కేసు కీలక మలుపుపై వైఎస్సార్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. గౌతమి ప్రమాదవశాత్తు మరణించలేదని, హత్య కేసును రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని మండిపడ్డారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ గౌతమిది రోడ్డు ప్రమాదం కాదని, ఆమెను కిరాయి హంతకులే బలిగొన్నారని ఆరోపించారు.

అటు  ఐదు జిల్లాల ప్రజలను మోసం చేసిన వెంకటరాయ చిట్ ఫండ్ పేరుతో వేలాది మందిని మోసగించారని  కారుమూరి ఆరోపించారు. బాధితులు ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం మాత్రం శూన్యం అని అన్నారు.  ఇంత జరుగుతున్నా  వెంకటరాయ ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేయక పోవడం దారణమన్నారు.  సొంత పార్టీ నేతలు అయినంత మాత్రాన ఇలా చేస్తారా అని కారుమూరి ప్రశ్నిం‍చారు. మోసం చేసిన సంస్థకు సంబంధించిన ఆస్తుల వేలాన్ని కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని, భాదితులకు న్యాయం జరిగేవరకు  సీజ్ చేసిన ఆస్తులు అలాగే ఉంచాలని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నా సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం​ ఏమి తెలియనట్లు మాట్లాడుతున్నారని అన్నారు. మోస పోయిన వారిలో మొత్తం 12 వేల మంది బాధితులు 5 జిలాల్లో ఉన్నారు. వెంకటరాయ చిట్స్‌ ఫండ్ డైరెక్టర్లను వెంటనే అరెస్టు చేయాలని కారుమూరి డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు