నగరంలో మళ్లీ డ్రగ్స్‌ కలకలం

21 Feb, 2019 11:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో మరోసారి డ్రగ్స్‌ కలకలం సృష్టించింది. సంపన్నుల పిల్లలు, విద్యార్థులను టార్గెట్‌ చేస్తూ దందా చేస్తున్న యువతిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి పెద్ద ఎత్తున కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఘనా దేశానికి చెందిన ఆ నిందితురాలు గత కొద్ది నెలలుగా సిటీలో డ్రగ్స్‌ అమ్ముతున్నట్లు తెలిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లోని వ్యాపారవేత్తల పిల్లలకు, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు  డ్రగ్స్‌ విక్రియంచినట్టు విచారణలో తేలింది. ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం డ్రగ్స్‌ కొనుగోలు చేసిన వారందిరికీ త్వరలో నోటీసులు ఇస్తామని అధికారులు చెప్పారు. సిటీకి డ్రగ్స్‌ ఎలా తీసుకొస్తున్నారు.. ఇంకా ఎవరెవరున్నారు అని పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

మరిన్ని వార్తలు