తొమ్మిది కోట్ల విలువైన బంగారం పట్టివేత

22 Feb, 2019 18:40 IST|Sakshi

సాక్షి, చెన్నై: చెన్నై విమానాశ్రయంలో శుక్రవారం భారీగా బంగారం పట్టుబడింది. ప్రయాణికులను తనిఖీ చేసే క్రమంలో ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది 25 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్సిల్‌ విభాగంలో తనిఖీలు చేస్తున్న డీఆర్‌ఐ అధికారులు స్మార్ట్ వాచ్‌లు, కెమెరా లెన్స్‌, యూఎస్‌బీ చిప్స్‌లలో భారీ ఎత్తున బంగారం ఉన్నట్లు కనుగొన్నారు.  బంగారం విలువ తొమ్మిది కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

మరిన్ని వార్తలు