13 మందికి ఉరి

17 Apr, 2018 11:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బాగ్దాద్‌: ఉరిశిక్ష విధించరాదని అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నప్పటికీ ఇరాక్‌ తాను అనుకున్న పని చేసిం‍ది. ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో 13 మంది నిందితులను ఉరి తీసినట్లు ఇరాక్‌ అధికారులు తెలిపారు. కారు బాంబులు, సెక్యూరిటీని చంపడం, కిడ్నాపులు తదీతర నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు 11 మందిపై నిరూపితమయ్యాయని ఇరాక్‌ మంత్రిత్వశాఖ తెలిపింది. మరో ఇద్దరు దోషుల గురించి వివరాలు వెల్లడించలేదు.

  ఏ ఒత్తిడి ద్వారా ప్రభావితం కాకుండా చట్టం అమలు చేయడంలో అంకితభావం ప్రదర్శిస్తున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఇరాకీ న్యాయస్థానాల్లో పారదర్శకత లేకపోవడంతో యూరోపియన్‌ యూనియన్‌తో పాటు పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. 2003, జూన్‌ 3న ఇరాక్‌లో మరణశిక్షను తాత్కాలికంగా రద్దు చేశారు. కానీ పలు కారణాలతో 2004, ఆగస్టు 8న మళ్లీ మరణశిక్ష ఇరాక్‌లో అమలులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు