ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం

1 Dec, 2023 12:50 IST|Sakshi

భువనేశ్వర్​: ఒడిశాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ​కియోంజర్ జిల్లాలో శక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన వ్యాన్​ ఢీకొట్టడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. 20వ జాతీయ రహదారి బలిజోడి గ్రామ సమీపంలో ఉదయం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందుకున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థి​తి విషమంగా ఉండటంతో కలకత్తా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి జీపు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది.  ప్రమాదానికి కారణమైన వ్యాన్​ డ్రైవర్​​ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అతని కోసం గాలిస్తున్నారు.

ఘటగావ్‌లో ఉన్న మాతా తారిణి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని చెప్పారు. వారంతా గంజాం జిల్లాలోని పొడమరి గ్రామానికి చెందినవారని వెల్లడించారు. బాధితుల్లో పలువురు మాజీ రాజ్యసభ సభ్యుడు రేణుబాల ప్రధాన్‌ బంధువులు కూడా ఉన్నారని తెలిపారు. 

మరిన్ని వార్తలు