గృహిణి అదృశ్యం.. చెట్టుకు కట్టేసి

16 May, 2019 12:02 IST|Sakshi

భోపాల్‌ : ఓ గృహిణి అదృశ్యమవ్వడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇందుకు కారకులన్న అనుమానంతో ముగ్గురిని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు గ్రామస్తులు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ధార్‌ ప్రాంతానికి చెందిన ఓ గృహిణి కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయింది. ఓ యువకుడే ఇందుకు కారణం అని భావించిన గ్రామస్తులు అతనితో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల్లో ఒకరు మైనర్‌ కావడం గమనార్హం. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఏఎన్‌ఐ ప్రచురించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఏఎన్‌ఐ పోస్ట్‌ చేసిన ఫోటోలో ఒక వ్యక్తిని, మహిళను చెట్టుకు కట్టేసి ఉండగా.. వారి చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. ఈ సంఘటన ధార్‌ అర్జున్‌ కాలనీలో సంభవించినట్లు ఏఎన్‌ఐ వెల్లడించింది. ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఓ ఐదుగురు అనుమానితులను అరెస్ట్‌ చేశామని.. తర్వలోనే మిగతావారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
గృహిణి అదృశ్యం.. అనుమానంతో చెట్టుకు కట్టేసి..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు