వివాహితను తుపాకితో కాల్చి..ఆపై ఆత్మహత్య

13 Jul, 2020 09:40 IST|Sakshi

ఢిల్లీ: గుర్‌గ్రామ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి  తుపాకీతో కాల్చి ఓ వివాహితను హత్య చేశాడు. అనంతరం తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం పటౌడీలో జరిగింది. మృతి చెందిన మహిళను ప్రియాంకగా, హత్య చేసిన వ్యక్తిని రాజేష్‌గా పోలీసులు గుర్తించారు. వివరాలు.. పటౌడిలోని నాన్కువాన్ గ్రామానికి చెందిన విరిద్దరూ గత కొన్ని ఎళ్లుగా సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాజేష్‌కు వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అదే విధంగా ప్రియాంకకు జూన్‌ 29న వివాహం జరిగింది. తన తల్లిని చూడటానికి ప్రియాంక నాన్కునాన్‌ గ్రామానికి వచ్చింది. అయితే శనివారం రాజేష్‌ ప్రియాంకను దాబా వద్దకు తీసుకువెళ్లాడు. ప్రియాంక ఇంటికి తిరిగి రాకపోవటంతలో కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. (మహిళా కమెడియన్‌కు లైంగిక వేధింపులు)

ఆదివారం ఉదయం 5 గంటలకు దాబా వద్ద ఉ‍న్న ఖాళీ ప్రదేశంలో రెండు మృత దేహాలు ఉన్నట్లు ప్రియాంక కుటంబు సభ్యులకు స్థానికులు సమాచారం అందించారు.  ప్రియాంక పక్కనే రాజేష్‌ మృత దేహం​, తుపాకి  కనిపించాయి. దీంతో ప్రియాంక మామ రామ్‌జీ పోలీసులకు  సమాచారం అందించారు. రంగంలో దిగిన పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృత దేహాలను శవపరీక్షకు తరలించారు.

అదే విధంగా ఘటన స్థలంలో లభించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేష్‌ ముందు తన కోడలు ప్రియాంకను ఛాతిలో కాల్చి తర్వాత తనను తాను కాల్చుకున్నట్లు ప్రియాంక మామ రామ్‌జీ లాల్లా పోలీసులకు తెలిపాడు. రామ్‌జీ  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా