వివాహిత ఆత్మహత్య!

23 Feb, 2018 12:13 IST|Sakshi
అనాథగా మారిన బాలుడు నిఖిల్‌ ,మృతి చెందిన సుధారాణి

భార్య, భర్తల మధ్య మనస్పర్థలే కారణమా?

నా కుమార్తెను ‘చంపేశారు’...!: తండ్రి రెడ్డెయ్య ఆవేదన

అనాథగా మారిన తొమ్మిది నెలల బాలుడు

కడప అర్బన్‌ : కడప నగరం అక్కాయపల్లెకు చెందిన ఓ వివాహిత గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటనపై మృతురాలి తండ్రి, బంధువులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  ఎర్రగుంట్లలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న పాతకడప రెడ్డెయ్య, రమణమ్మల కుమార్తె సుధారాణి (21)కి, కడప నగరంలోని అక్కాయపల్లెకు చెందిన కోటపాటి శ్రీకాంత్‌కు 2015లో వివాహమైంది. వివాహ సమయంలో రూ. 6 లక్షలు కట్నంగా ఇచ్చారు. వీరికి నిఖిల్‌ (9 నెలలు) అనే బాలుడు ఉన్నాడు. శ్రీకాంత్‌ కడప నగరంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నాడు.  కాగా వివాహమైనప్పటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయి. ఇటీవల సుధారాణి తమ పుట్టింటికి వెళ్లింది.

గత శనివారం శ్రీకాంత్‌ సోదరుడు, తన వివాహం వచ్చేనెల 7న జరగనుందని, తన వదిన సుధారాణిని ఇంటికి పిలుచుకుని వచ్చాడు. ఈ క్రమంలో కళాశాల నుంచి ఇంటికి భోజనానికి వచ్చిన శ్రీకాంత్‌ తన భార్యతో గొడవపడ్డాడు. తర్వాత కళాశాలకు వెళ్లాడు. అదే సమయంలో ఆమె ఇంట్లో అపస్మారకంగా పడి ఉండటంతో బంధువులు, స్థానికులు 108 ద్వారా సుధారాణిని రిమ్స్‌కు తరలించారు. అప్పటికే రిమ్స్‌ క్యాజువాలిటీలో సుధారాణికి ప్రాథమిక వైద్య పరీక్షలు చేసిన వైద్యులు మృతి చెందిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి రెడ్డెయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఐదుగురిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎన్‌. రాజరాజేశ్వర రెడ్డి తెలిపారు.   

నా కుమార్తెను చంపేశారు: మృతురాలి తండ్రి రెడ్డెయ్య ఆవేదన
తన కుమార్తెను పథకం ప్రకారమే, పిలిపించి చంపేసి అన్యాయం చేశారని మృతురాలు సుధారాణి తండ్రి రెడ్డెయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌కు ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు ఉండేవని, తన కుమార్తెను సరిగా చూసుకోకపోవడంతోనే ఇంటికి తీసుకుని వెళ్లామన్నారు. తమ కుమార్తె శరీరంపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయన్నారు. కాగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.  ఈ సంఘటనలో తల్లి మరణించి, తండ్రి కటకటాలపాలు కావడంతో వారి కుమారుడు నిఖిల్‌ 

మరిన్ని వార్తలు