సరదగా జెట్‌ స్కై రైడ్‌కు వెళ్లిన బాలికపై...

12 Jul, 2019 20:09 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, ముంబై : సరదాగా గడపడానికి విహార యాత్రకు వెళ్లిన తల్లీ కూతుళ్లకు చేదు అనుభవం ఎదురైంది. ముంబైకి చెందిన మహిళ తన ఏడేళ్ల కుమార్తెతో మాల్ధీవులకు సరదాగా గడిపేందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో వారు జెట్‌ స్కై రైడ్‌కి వెళ్లాలనుకున్నారు. అయితే స్కైరైడ్‌కి ఒకేసారి ఇద్దరు వెళ్లాడానికి వీలు లేకపోవడంతో ఆ మహిళ తన కుమార్తెను డ్రైవర్‌ వెంట పంపించింది. రైడింగ్‌లో బాలిక ఒంటరిగా ఉండటంతో డ్రైవర్‌ తన వక్రబుద్ది చూపించి, బాలికను లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత జెట్‌ నుంచి తిరిగి వస్తున్న బాలిక ఆందోళనగా కనిపించడంతో తల్లి అనుమానించింది. దీంతో మహిళ కుమార్తెను ప్రశ్నించగా  ‘జెట్‌ స్కై డ్రైవర్‌ తనతో ఆసభ్యంగా ప్రవర్తించాడని’ బాలిక తెలిపింది. డ్రైవర్‌ నిర్వాకంపై వారు మాల్దీవుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో భాగంగా బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు బాలిక తల్లికి తెలిపారు. అయితే ఆరోజే వారు తిరిగి ముంబై రావాల్సి ఉండటంతో వైద్య పరీక్షలు ముంబైలో నిర్వహిస్తానని పోలీసులకు చెప్పి ఫిర్యాదు పత్రాన్ని తిసుకుని తిరిగి ముంబైకి బయలుదేరారు.

మాల్దీవుల నుంచి ఇంటికి చేరుకున్న మహిళ శనివారం ఉదయం జూహులోని కూపర్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం తన కుమార్తెను తీసుకుని వెళ్లింది. ఆస్పత్రికి వెళ్లాక వారిని గంటల కొద్ది వేచిఉంచారని, పరీక్షల కోసం అటు ఇటు తిప్పి చివరకు మైనర్‌ బాలికకి వైద్య పరీక్షలు చేయడం పోక్సో చట్టం ప్రకారం నేరమని వారితో చెప్పినట్లు బాలిక తల్లి తెలిపింది. తన వద్ద మాల్దీవ్‌ పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రం ఉన్నప్పటికి ఆస్పత్రి వారు మహిళా కానిస్టేబుల్‌ లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం చట్ట ప్రకారం నేరమని బుకాయించినట్లు ఆమె తెలిపింది.  అయితే మైనర్‌ బాలిక లైంగిక వేధింపులకు గురై ఆస్పత్రికి వెళితే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల బాధిత బాలిక తల్లి ఆందోళన వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు