దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు.. అరెస్టులు

7 Aug, 2018 16:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ఉగ్రకదలికలపై నిఘా వర్గాల సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే గత రెండు రోజులుగా హైదరాబాద్‌ను జల్ల పడుతున్న అధికారులు పాతబస్తీలోని షాయిన్‌ నగర్‌, పహడి షరీఫ్‌లో సోదాలు నిర్వహించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం అభిపురా రెహమాన్‌ను అరెస్ట్‌ చేసిన అధికారులు.. బీహార్‌లోని బౌద్ధ గయా, ఉత్తరాఖండ్‌, అర్ధకుంభమేలలో విధ్వంసం సృష్టించేందుకు  కుట్ర పన్నినట్లు గుర్తించారు. (నగరంలో ఐసిస్‌ కలకలం)

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఏ బృందాలు బౌద్ధ గయాలో ఐఈడీలను అమర్చారన్న ఆరోపణలతో  గత శుక్రవారం (3న) కేరళలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ పేలుళ్ల కేసులో  మరో ఇద్దరిని బెంగళూరులో అరెస్ట్‌ చేశారు. జమాతే ఉల్‌ ముజాహీద్దున్‌ బంగ్లాదేశ్‌ సంస్థతో సంబంధాలు కొనసాగిస్తూ బౌద్ద గయాలో పేలుళ్లకి కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఈ పేలుళ్ల కుట్రలో మహమ్మద్‌ జాహిద్దుల్‌ ఇస్లాం కీలక సూత్రధారి అని , ఇతని ఆదేశాల మేరకే ముస్తాఫీ జుర్‌ పేలుళ్ల  సామాగ్రిని సమకూర్చినట్లు విచారణలో కనుగొన్నారు. ఈ నేపథ్యంలో నిందితులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. షాహిన్‌ నగర్‌కు చెందిన తండ్రి కొడుకులు అబ్దుల్‌ కుద్దుస్‌, అబ్దుల్‌ ఖదీర్‌లను 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు.

పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు.. కలకలం

>
మరిన్ని వార్తలు