ప్రవాస భారతీయుడి అనుమానాస్పద మృతి

22 Jul, 2019 15:03 IST|Sakshi

న్యూఢిల్లీ : అమెరికాలో స్థిరపడ్డ భారత వ్యాపారవేత్త ఆదివారం శవంగా తేలాడు. దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మున్ని జైట్లీ(35) అనే ప్రవాస భారతీయుడు తన కుటుంబంతోపాటు అమెరికాలో స్థిరపడ్డాడు.  గురువారం వ్యాపారరీత్యా న్యూఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌లోకి అద్దెకు దిగారు. ఈ  క్రమంలో శుక్రవారం జెట్లీకి  అతడి తండ్రి ఎన్ని సార్లు కాల్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో హోటల్‌ స్టాఫ్‌కు కాల్‌ చేసి కొడుకుతో మాట్లాడాలని చెప్పారు. హోటల్‌ యజమాన్యం ల్యాండ్‌ లైన్‌ ద్వారా కాల్‌ కలపగా.. జైట్లీ ఫోన్‌ తీయకపోవడంతో హోటల్‌ సిబ్బంది వారి దగ్గరున్న మరో కీ గది తాళం తీసి చూడగా  అతడు స్పృహ కొల్పోయి ఉన్నాడు. వెంటనే సమీపంలోని  ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని డాక్టర్లు తెలిపారు.

ఈ ఘటనపై హోటల్‌ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం జైట్లీది సాధారణ మృతిగానే భావిస్తున్నామని  అయితే ఇప్పుడే అతడి మృతికి గల కారణాలను వెల్లడించలేమని పోలీసులు తెలిపారు. మరిన్ని పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఫోరెన్సిక్ లాబొరేటరీకి తరలించినట్లు పేర్కొన్నారు. ఇక మున్ని జైట్లీ అకాల మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

మరిన్ని వార్తలు