పాక్‌ ఖైదీని రాళ్లతో కొట్టి చంపారు..!

20 Feb, 2019 15:57 IST|Sakshi

జైపూర్‌ : రాజస్థాన్‌లోని జైపూర్‌ సెంట్రల్‌ జైలులో ఘోరం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన ఓ ఖైదీని తోటి ఖైదీలు రాళ్లతో కొట్టి చంపారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాక్‌ ఖైదీ షకీరుల్లా హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. గూఢచర్యం కేసులో షకీరుల్లా శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు ఖైదీల ప్రమేయమున్నట్లు పోలీసులు తేల్చారు. పాక్‌ ఖైదీ మృతిని జైళ్ల శాఖ ఐజీ ధృవీకరించారు. భారత్‌ జైళ్లలో 347 మంది పాకిస్తాన్‌ ఖైదీలు శిక్షను అనుభవిస్తుండగా.. పాక్‌ జైళ్లలో 537 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు. (మరణించి కూడా ఊరిలో వెలుగులు నింపిన జవాను)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు