వివాహితపై పెట్రోలుతో దాడి

27 Dec, 2018 12:17 IST|Sakshi
మాట్లాడుతున్న కదీరున్నీసా

చిత్తూరు, కలికిరి: వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి హత మార్చేందుకు యత్నించిన ఘటన బుధవారం కలికిరిలో కలకలం సృష్టిం చింది. పోలీసుల కథనం.. స్థానిక కోటవీధిలో నివా సం ఉంటున్న కదీరున్నీ సా(35) తన తల్లితో కలిసి టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తోంది. బుధవారం తెల్లవారుజామున టిఫిన్‌ సెంటర్‌ వద్ద పొయ్యి వెలిగిస్తుండగా ఆమెపై అగంతకులు పెట్రోలు చల్లారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె తల్లి, చుట్టుపక్కల వారు వచ్చి మంట లను ఆర్పారు. అప్పటికే బాధితురాలి ముఖం, చేతులు, కాళ్లు కాలాయి. 108లో ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కలికిరి, మదనపల్లెలో చికిత్స చేశారు. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరిగి మదనపల్లె నుంచి తిరుపతి రుయాకు తరలించారు. బాధితురాలి తల్లి షాకీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. కాగా, 20 ఏళ్లక్రితం అబ్దుల్‌ రెహమాన్‌తో వివాహమైన కదీరున్నీసా పదేళ్ల క్రితం భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటూ, కుమార్తెను చదివించుకుంటోంది. తనకు ఎవరితోనూ గొడవలు లేవని, అయితే అగంతకులు మోటార్‌ సైకిల్‌పై నాలుగు రోజులుగా బజారులో చక్కర్లు కొట్టారని బాధితురాలు చెబుతోంది. పోలీసుల దర్యాప్తులో అగంతకులెవరో తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు