వ్యభిచారం కేసులో కానిస్టేబుల్‌ అరెస్టు

5 Mar, 2020 16:19 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌ : వ్యభిచారం కేసులో కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. బంజారాహిల్స్‌లోని కృష్ణానగర్‌లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులతో పాటు లంగర్‌హౌస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రఘును కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పిటా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు