దొంగ‌త‌నంతో కోర్టుకు కృత‌జ్ఞ‌త‌!

19 May, 2020 15:18 IST|Sakshi

క‌రాచీ: ఓ కేసులో నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అత‌ను కోర్టుకు కృత‌జ్ఞ‌త తెలుపుదామ‌నుకున్నాడో ఏమో కానీ వెంట‌నే కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఉన్న ఓ బైకును ఎత్తుకెళ్లాడు. ఈ  వింతైన‌ ఘ‌ట‌న పాకిస్తాన్‌లో జ‌రిగింది. క‌రాచీలోని సింధ్ ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తి దొంగ‌త‌నం కేసులో శిక్ష అనుభ‌విస్తున్నాడు.. తాజాగా అత‌ను విచార‌ణ నిమిత్తం కోర్టులో హాజ‌ర‌య్యాడు. ఈ కేసులో ప‌లు మార్లు విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం అత‌నికి బెయిల్ మంజూరు చేసింది. అయితే చింత ‌చ‌చ్చినా పులుపు చావ‌దు అన్న‌ట్లు ఇన్నిరోజులు జైల్లో ఉన్నా అత‌ని వ‌క్ర‌బుద్ధి మాత్రం అలాగే ఉంది. (అనస్థీషియా వైద్యుడి వీరంగం)

బెయిల్ వ‌చ్చినందుకు సంతోష‌ప‌డ‌టం మాని కోర్టు ఆవ‌ర‌ణ‌లో పార్క్ చేసి ఉన్న బైకును ఎత్తుకెళ్లిపోయాడు. దీన్ని గ‌మ‌నించిన పోలీసులు అత‌డిని వెంబ‌డించి అరెస్టు చేశారు. ఈ దృష్యాలు అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డ‌వ‌గా ప్ర‌స్తుతం ఈ క్లిప్పింగ్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 'బెయిల్ ఇచ్చినందుకు కోర్టుకు ఆ విధంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడం'టూ నెటిజ‌న్లు ఛ‌లోక్తులు విసురుతున్నారు. ఈ దొంగోడు ఈ జ‌న్మ‌లో మార‌డంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆ దేశ రాజ‌ధాని క‌రాచీలో ప్ర‌తి రోజు 90 బైకులు చోరీకి గుర‌వుతాయ‌ని సిటిజ‌న్ పోలీస్ లియాసిగ్ క‌మిటీ వెల్ల‌డించింది. (యువకుడి తల నరికి.. కుడి చేతి వేళ్లను..)

మరిన్ని వార్తలు