హోలీ పేరిట విద్యార్థినులపై వికృత చేష్టలు

1 Mar, 2018 08:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హోలీ వేడుకల పేరుతో విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడిన ఘటనలు దేశ రాజధానిలో చోటు చేసుకున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థినులపై కొందరు ఆగంతకులు వీర్యంతో నింపిన బెలూన్లను విసిరి పరారయ్యారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

బాధితురాలి కథనం ప్రకారం... ఫిబ్రవరి 24వ తేదీన ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ యువతి అమర్‌ కాలేనీ మార్కెట్‌లోని ఓ కేఫ్‌కు వెళ్లింది. బైకులపై వచ్చిన ఐదుగురు యువకులు ఆమెపై బెలూన్లను విసిరారు. ఆపై హోలీ శుభాకాంక్షలు చెబుతూ అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయారు. హస్టల్‌కు వచ్చిన యువతి దుస్తులను పరిశీలించిన యువతికి అవి రంగులు కావని అర్థమైంది. ఈ వికృత చేష్టలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

ఇక ఢిల్లీ యూనివర్సిటీకే చెందిన మరో యువతికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. హస్టల్ బయట నడుచుకుంటూ వెళ్తున్న తనపై కొందరు వ్యక్తులు బెలూన్లు విసిరారని... ఆపై రంగులు పూస్తూ అసభ్యంగా తాకినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యూనివర్సిటీ వద్ద పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. మరోవైపు హోలి వేడుకల నేపథ్యంలో  ఢిల్లీలోని కాలేజీలు,  హాస్టళ్ల వద్ద సెక్యూరిటీని అప్రమత్తంగా ఉండాలంటూ యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు