విద్యార్థిని కిడ్నాప్, హత్య

3 Aug, 2019 07:26 IST|Sakshi
హత్యకి గురైన ముత్తరసి(ఫైల్‌) భరత్‌ ఇంట్లో విద్యార్థినిని పాతిపెట్టిన స్థలం

ప్రియుడు అరెస్టు

చెన్నై ,అన్నానగర్‌: తారాపురం సమీపంలో కళాశాల విద్యార్థిని కిడ్నాప్‌ చేసి హత్య చేసిన ప్రియుడు సహా ముగ్గురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. దిండుక్కల్‌ జిల్లా వేడచందూర్‌ సమీపంలో ఉన్న ప్రైవేట్‌ కళాశాలలో ముత్తరసి చదువుతోంది. ఈమె అక్క తమిళరసి, వివాహం జరిగి తిరుపూర్‌లో నివసిస్తుంది. తన అక్క ఇంటికి ముత్తరసి తరచూ వెళ్లి వచ్చినప్పుడు ఆత్తుక్కాల్‌ పుదూర్‌కి చెందిన లగేజీ వాహన డ్రైవర్‌ భరత్‌ (29)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఐదు నెలల ముందు హఠాత్తుగా ముత్తరసి మాయమైంది. వేడచందూర్‌కు వెళ్లిన భరత్, ముత్తరసిని ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా ఆత్తు క్కాల్‌పుదూర్‌కు కిడ్నాప్‌ చేసుకొచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన గురించి ముత్తరసన్‌ అక్క తమిళరసి వేడచందూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కోసం గాలింపు చేపట్టారు. విచారణలో ముత్తరసి భరత్‌ కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులకు తెలిసింది. అనంతరం వేడచందూర్‌ పోలీసులు గురువారం ఆత్తుక్కాల్‌పుదూర్‌కు వెళ్లి ఇంట్లో ఉన్న భరత్‌ని పోలీసులు విచారించారు. అతను ముత్తరసిని కిడ్నాప్‌ చేసుకువచ్చి హత్య చేసినట్లుగా పోలీసులకు తెలిపాడు.

భరత్‌ తెలిపిన వివరాలు.. వేడచందూర్‌ నుంచి ముత్తరసిని వివాహం చేసుకోవడానికి భరత్‌ కిడ్నాప్‌ చేసుకుని వచ్చాడు. కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. ఒక రోజు భరత్, తన వాహనంలో ముత్తరసిని ఎవరు లేని ఓ స్థలానికి పిలుచుకెళ్లాడు. అప్పుడు వారిద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆవేశంతో భరత్, ముత్తరసిని బలంగా కొట్టినట్లుగా తెలుస్తుంది. ఇందులో ముత్తరసిని అదే స్థలంలో స్పృహ తప్పి పడింది. దిగ్భ్రాంతి చెందిన భరత్‌ ఏమి చెయ్యాలో తెలియక, ముత్తరసిని ఆత్తుక్కాల్‌పుదూర్‌లోని తన ఇంటికి తీసుకువచ్చాడు. ఈ విషయం గురించి భరత్‌ తన కన్నవారికి తెలిపాడు. దిగ్భ్రాంతి చెందిన అతని కుటుంబీకులు, ముత్తరసిని చూశారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా తెలిసింది. హత్య విషయం బయటకు తెలియకుండా ఇంటి వెనుక భాగంలో ఆమె మృతదేహాన్ని పాతిపెట్టారు. తరువాత భరత్‌కి, వీరాట్చి మంగలమ్‌కి చెందిన మరొక మహిళతో పెళ్లి నిశ్చయించారు. వివాహం జరిగేటప్పుడు ఇంట్లో శవం పాతిపెట్టడం కుటుంబానికి మంచిది కాదని భరత్‌ కన్నవారు తలచారు. ఈ ప్రకారం ముత్తరసి మృతదేహాన్ని తవ్వి తీశారు. అప్పుడు మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. సమీపంలో ఉన్న పొట్టల్‌కాడుకి తీసుకు వెళ్లి మృతదేహాన్ని కాల్చేశారు. తరువాత ఏమి జరగనట్లు భరత్, అతని కుటుంబీకులు ఇంటికి వచ్చారు. వైకాసి నెలలో భరత్‌కి వివాహం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు భరత్, అతని బంధువులు ఇద్దరిని అరెస్టు చేశారు. వేడచందూర్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ కోసలైరామన్‌ ఆధ్వర్యంలో పోలీసులు తిరుప్పూర్‌కు వెళ్లారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెళ్లైన 20 రోజులకే భర్తను సజీవదహనం చేసిన భార్య

ఓలా క్యాబ్‌ అంటూ ప్రైవేటుకారులో...

తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా..

యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారని: వైరల్‌

ఘరానా దొంగలు.. ఏసీలు రిపేరు చేస్తామంటూ..

జూదంలో భార్యను పణంగా పెట్టి..

80 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

జిల్లాలో సారా పరవళ్లు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం

వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి

రూ.లక్ష కోసం ట్రిపుల్‌ తలాక్‌.. కేసు నమోదు..!

అప్పు తీర్చలేకే హత్య 

అత్తపై అల్లుడి లైంగిక దాడి

ప్రాణం తీసిన సరదా పందెం 

ఉద్యోగం కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..

భార్యను కడతేర్చిన భర్త

అమ్మా ! నాకెందుకు ఈ శిక్ష.. 

వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం

భరించలేక.. బాదేశారు!

కాళ్లపారాణి ఆరకముందే నూరేళ్లు

చదువుతూనే గంజాయి దందా..

నిఘా నిద్ర.. జూదం దర్జా! 

ఉపాధ్యాయ వృత్తికే కళంకం

మనోహరన్‌కు రెండు ఉరి, యావజ్జీవ శిక్షలు

రూ. 25 కోట్ల అధర్మ ఆదాయం!

హలో ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నా..

మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య

కుమార్తెను కడతేర్చి తల్లి ఆత్మహత్య

తూత్తుకుడిలో అదీబ్‌

కాజల్‌తో భేటీకి రూ.60 లక్షలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

వసూళ్ల వర్షం పడుతోంది

కొత్త గెటప్‌