తమిళనాడు చేరుకున్న జవాన్ల మృతదేహాలు

16 Feb, 2019 16:30 IST|Sakshi

చెన్నై: కశ్మీర్‌లో తీవ్రవాదుల దాడిలో మరణించిన ఇద్దరు తమిళ జవానుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఉగ్రదాడిలో చనిపోయిన శివచంద్రన్‌ స్వగ్రామం కారైకుడికి, మరో జవాను స్వగ్రామం తూత్తుకుడికి ప్రత్యేక మిలటరీ వాహనాల్లో తరలించారు. ముందుగా తిరుచ్చి విమానాశ్రయం చేరుకున్న జవానుల మృతదేహాలకు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘననివాళులు అర్పించారు.

 అక్కడి నుంచి అధికార లాంఛనాలతో ఖననం చేసేందుకు జవానుల గ్రామాలకు తరలించారు. తిరుచ్చి నుంచి రెండు మార్గాల ద్వారా బయలుదేరిన జవానుల భౌతికకాయాలకు దారిపొడవునా ప్రజలు అశ్రునివాళులు అర్పించారు. అధికారులు, మంత్రులతో పాటు ప్రజలు గౌరవ సూచకంగా అంతిమ యాత్రలో పాల్గొనడంలో రోడ్లు స్తంభించిపోయాయి. అమరవీరుల త్యాగాలను మరువబోమంటూ, జైహింద్‌ అంటూ యువకులు, అన్నివర్గాల ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు