సెల్‌ఫోన్‌ దొంగల అరెస్టు

2 Jun, 2018 13:02 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్‌ 

రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సెల్‌ఫోన్లను చోరీ చేస్తున్న ఇద్దరు యువకులు

భువనగిరి రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన నల్లగొండ రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్‌

నల్లగొండ క్రైం : జల్సాలకు అలవాటు పడి అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనుకున్నారు.. సెల్‌ఫోన్లు చోరీలు చేయడం మొదలు పెట్టారు. అందుకు రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఎవరైన ప్రయాణికులు నడుస్తున్న రైలు ఎక్కుతూ సెల్‌ఫోన్‌ మాట్లాడుతుంటే వారి చేతిని కర్రతో కొట్టి.. ఫోన్‌ కిందపడగానే లాక్కెళ్తున్నారు. ఇలా రెండేళ్లుగా చోరీ చేస్తున్నారు. శుక్రవారం భువనగిరి రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతూ చోరీ చేస్తున్న ఇద్దరి యువకులతో పాటు వాటిని కొనుగోలు చేస్తున్న మరో నలుగురిని నల్లగొండ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.

వారి వద్ద నుంచి రూ.2,80,000 విలువైన 24 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్‌ సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ అచ్యుత్‌తో కలిసి నల్లగొండ రైల్వేస్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. భువనగిరి పట్టణంలోని తాతానగర్‌కు చెందిన విద్యార్థి ముదరకోల శ్రీధర్, ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న కామసాని శేఖర్‌లు రైలు ప్రయాణికుల నుంచి చాకచక్యంగా సెల్‌ఫోన్లు కొట్టేస్తూ తాతానగర్‌కు చెందిన  భానుప్రకాశ్, తిమ్మపూర్‌కు చెం ది న దాసరపు గణేశ్, జహంగీర్, దాసరి రవీందర్‌ల కు విక్రయిస్తున్నారు. ప్రయా ణికుల ఫిర్యాదు మే రకు రైల్వే పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. 

చోరీ చేసేది ఇలా.. 

రైలు నిదానంగా వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సెల్‌ఫోన్‌ మాట్లాడడం, వాట్సప్, ఫేస్‌బుక్‌ చూస్తున్నప్పుడు శ్రీధర్, శేఖర్‌లు కర్రతో చేతిపై కొడతారు. ఫోన్‌ కిందపడగానే తీసుకుపోయి ఇతరులకు విక్రయిస్తుంటారు.

మరిన్ని వార్తలు